సిఆర్పి 145 అమల్లో ఉన్నా.. కుదునూరు పోడు భూముల్లో మట్టి తరలింపులు?
అడ్డూ అదుపు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నాయంటున్న స్థానికులు ఫారెస్ట్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు పొలిటికల్ పవర్, చర్ల, సెప్టెంబర్ 18మండల పరిధిలోని కుదునూరు ప్రాంతంలోని పోడు భూముల్లో మట్టి తవ్వకాలు, మట్టి తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత భూముల విషయంలో వివాదాలు, శాంతిభద్రతలకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్న సమయంలోనే మట్టిని తవ్వి ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయి. పోడు భూముల్లో మట్టిని తవ్వడం, పెద్ద ఎత్తున మట్టిని తరలించడం...