POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 5:04 pm Posted by : POLITICAL POWER

సినిమా పిచ్చి ఉన్నవాళ్లు మాత్రమే జనసేనలో చేరుతున్నారు

పవన్ కల్యాణ్ అభిమానులమని చెప్పి బీజేపీని వీడుతున్నారు: టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కె సతీష్ కుమార్ ఆగస్టు 11, 2026: హైదరాబాద్ బీజేపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్తున్న వారిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి జనసేనలో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నిస్తే.. “నేను పవన్ కల్యాణ్ అభిమానిని.. అందుకే జనసేనలో చేరాను” అని కొందరు సమాధానం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ విధానాల కంటే సినిమా హీరోలపై ఉన్న అభిమానమే జనసేనలోకి వెళ్లడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లు, సినిమా అభిమానులు మాత్రమే జనసేన వైపు వెళ్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ పరిణామాల మధ్య కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాంచందర్ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.