సీతారామ కాలవ మట్టిని అక్రమంగా తోడేస్తున్న మట్టి మాఫియా.. అడ్డుకున్న గిరిజనులపై దౌర్జన్యం ప్రజావాణిలో తహసిల్దార్ కు ఫిర్యాదు
పొలిటికల్ పవర్ దమ్మపేట, సెప్టెంబర్ 7: పెద్దగొల్లగూడెం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కాలవ మట్టిని యథేచ్ఛగా దోచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నగొల్లగూడెం గిరిజనులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఆపరేషన్: చిన్నగొల్లగూడెం శివారులోని సీతారామ, ఇందిరా సాగర్ ప్రాజెక్టు కాలవల మట్టిని ఇదే గ్రామానికి చెందిన గుర్రం మల్లయ్య అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటలకు జె.సి.బి.లు, ట్రాక్టర్లతో మట్టిని తోడుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం: గతంలో...