POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 2:05 pm Posted by : POLITICAL POWER

సురవరం జయంతిని విజయవంతం చేయండి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 24 2026: ఈ నెల 28న వనపర్తిలో “సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతిని విజయవంతం చేయాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.ఆదివారం పెబ్బేరు మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సాహితీవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా తెలంగాణ ప్రాంతానికి ప్రతాపరెడ్డి విషయమైన సేవలందించారని అన్నారు. వనపర్తి నియోజకవర్గ మొట్ట మొదటి శాసన సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని శంకర్ గౌడ్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలుగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, శ్రీధర్ రావు దేశ్పాండే, వి ప్రకాష్, డా జయంతి, డా తంగెళ్ల శ్రీదేవి రెడ్డి, డా కి వీరయ్య తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఉమా మహేశ్వర్, రామచందర్ జీ, మొయినుద్దీన్, ఈశ్వర్ రెడ్డి, బత్తుల మురళీధర్ గౌడ్, విజయ్, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.