POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:18 pm Posted by : POLITICAL POWER

సెప్టెంబర్ 28న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయండి సిపిఐ

 *సెప్టెంబర్ 27–30 సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలి.సిపిఐ మండల కార్యదర్శి పెద్దులపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు*

 

ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించనున్న సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని తెలిపారు.

సెప్టెంబర్ 28న చలో కడప పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో బద్వేల్ పట్టణము నుండి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, కడప ఉక్కు ఫ్యాక్టరీ.కార్మికులు–రైతుల సమస్యలు, యువతకు ఉపాధి, సంక్షేమ రంగాల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై ప్లీనరీలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై సిపిఐ నిర్వహిస్తున్న ఉద్యమాల కొనసాగింపులో భాగంగా కడపలో జరిగే ఈ రాష్ట్రస్థాయి ప్లీనరీని విజయవంతం చేయడం ద్వారా “బద్లావ్ జెరూరి హై” అనే నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ప్రజాస్వామికవాదులు, కడపకు జరిగే ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని సిపిఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సోమిరెడ్డిపల్లి నారాయణ ఏఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి గుడిమె సురేష్, సుజన్ పాల్గొన్నారు..