సేంద్రియ పద్ధతిలో పండించిన వంకాయలు వనపర్తి మార్కెట్లోకి

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: పానుగల్ మండలం ఆకునోనిపల్లి గ్రామానికి చెందిన రైతు జూటూరు స్వామి సేంద్రియ ఎరువుల పద్ధతిలో పండించిన వంకాయలను స్థానిక మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నారు. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ పద్ధతులను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన కూరగాయల ఉత్పత్తికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం సేంద్రియ ఎరువులతో సాగు చేసిన వంకాయ పంట మార్కెట్లో అందుబాటులో ఉందని రైతు స్వామి తెలిపారు. గత...