POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 6:29 pm Posted by : POLITICAL POWER

సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాలోత్ సురేష్ నాయక్… రానున్న రోజులో బంజారా ప్రజల సంక్షేమం కోసం, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

 

సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణరాష్ట్రఉపాధ్యక్షుడిగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధి చిన్నకిష్టాపురం గ్రామపంచాయతీపరిధిలోనిదేశ్యతండాకు చెందిన మాలోత్ సురేష్ నాయక్ నియమితులయ్యారు. బంజారా సమాజ ఐక్యత, సంఘం అబివృద్ధి, సామజిక అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ నియామకం చేపట్టినట్లు సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కే. మోతిలాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్బంగా సురేష్ నాయక్ కు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు స్వికరించిన మాలోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కే. మోతిలాల్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో బంజారా ప్రజల సంక్షేమం కోసం, సంఘం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. సురేష్ నాయక్ నియామకం పట్ల బంజారా నాయకులు, తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.