POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 11:36 pm Posted by : POLITICAL POWER

*సేవా దినంగా జన్మదినం: అనపర్తిలో మజ్జిగ చలివేంద్రం, అన్నదానం*

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దిన పత్రిక అండ్ పిఎన్ 9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 01:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలే నిజమైన వేడుకలని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. తన జన్మదినాన్ని సేవా దినంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు.
అనపర్తి కెనాల్ రోడ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కృష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు యువజన విభాగం నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణారెడ్డి, పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించడంకంటే ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి సేవాభావంతో ముందుకు వస్తేనే సమాజం అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు.
అనంతరం తేతలి రామిరెడ్డి–మంగాయమ్మల చారిటబుల్ ట్రస్ట్‌లో వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మానవతా విలువలను చాటారు.
కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం మరియు సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.