POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 4:50 pm Posted by : POLITICAL POWER

సోమవారం అమావాస్య సందర్భంగా అచ్చుతాపురం గ్రామంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 15 2026: వనపర్తి జిల్లా అచ్చుతాపురం గ్రామంలోని గుంటి పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం గుంటి పంచముఖ ఆంజనేయస్వామి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహ పూజలను నిర్వహించారు. తదనంతరం గుంటి పంచముఖ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి భక్తుల చేత ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించగా, మహా మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే మహా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు రమేష్ శర్మ, పూజారి నవీన్ శర్మ, సర్పంచ్ శాంతయ్య, ఉపసర్పంచ్ శివకుమార్, మాజీ సర్పంచ్ ఆశన్న నాయుడు, వార్డ్ సభ్యుడు రామన్ గౌడ్, డైరెక్టర్ శివశంకర్ రెడ్డి, రామస్వామి, కృష్ణయ్య, నీలయ్య, బొగ్గు మల్లికార్జున, రాజశేఖర్, రమేష్, సురేష్, మహేష్, కిట్టు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వనపర్తి జిల్లా పరిసర ప్రాంతాల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య విజయవంతంగా ముగిసింది.