POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 10:34 am Posted by : POLITICAL POWER

సోలిపూర్ బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు 

టి సింధుజా శేఖర్ రెడ్డి సర్పంచి, సోలిపూర్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: ఖిల్లా ఘనపూర్ మండలం, సోలిపూర్ గ్రామంలో, నేడు మంగళవారం రోజు, జరిగే బోనాల పండుగ సందర్భంగా గ్రామానికి విచ్చేస్తున్నటువంటి గ్రామ ఆడపడుచులకు, మరియు కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు, గ్రామస్తులకు పేరుపేరునా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సోలిపూర్ గ్రామ సర్పంచ్ టి.సింధుజా శేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా టి.సింధుజా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి కి, ప్రతీక బోనాల పండుగ అని అన్నారు. పోచమ్మ అమ్మ ఆశీస్సులు గ్రామ ప్రజలపై ప్రతి ఒక్కరిపై ఉండాలని బోనం సమర్పించే ప్రతి ఆడపడుచుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.పసుపు, కుంకుమ, చీర, గాజులతో అలంకరించిన బోనం మన సంప్రదాయానికి గర్వకారణం అన్నారు. పొంగళి వాసన, డప్పుల చప్పుడు, పోతురాజుల నృత్యం-అన్నీ కలిస్తేనే బోనాలు. అమ్మ దయతో మన రాష్ట్రంలో వర్షాలు కురిసి, పంటలు పండాలి. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి. కుల, మతాలకు అతీతంగా అందరం కలిసి పండుగ జరుపుకోవాలన్నారు. తెలంగాణ ఆడబిడ్డల త్యాగానికి, భక్తికి ప్రతీక బోనాలు. శివసత్తుల నృత్యం, బోనాల ఊరేగింపు మన గుండెల్లో ఉత్సాహం నింపుతాయి. అమ్మకు సమర్పించే బోనం మన కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. ఈ పండుగ మన సంస్కృతిని, ఐక్యతను ప్రపంచానికి చాటుతుంది. పేద, ధనిక తేడా లేకుండా అందరం అమ్మ పాదాల వద్ద ఒక్కటవుతాం. బోనాల సందడిలో మన బంధాలు మరింత బలపడాలి అని ఆకాంక్షించారు.ఈ సంవత్సరం కూడా చెరువులు నిండి, వ్యవసాయానికి అనుకూలంగా, ప్రజలు సుభిక్షంగా ఉంటూ, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని పోచమ్మ అమ్మవారి దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు.ఈ సంభారాలాలలో.. పాల్గొంటున్న గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని గ్రామ సర్పంచ్ టి.సింధుజా శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.