పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ జూన్ 24 2024: బుదవారం రోజు ఖమ్మం నగరం నందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 2026 – 2027 విద్య సంవత్సరమునకు నూతనంగా వెనుకబడిన దళితుల పిల్లల బాగు ఏర్పాటు చేయబడిన స్కీం చదువుల నిమిత్తం డ్రా తీస్తున్న సందర్భంగా… ఖమ్మం నగరంలో అంతకుముందు బెస్ట్ అవైలబుల్ విద్య అందిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలకు పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు మాతంగి అనిల్ కుమార్ & ఐ. విజయ్ లు కోరినారు. మా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఖమ్మం నగర 3 టౌన్ ప్రాంతంలో సెంట్ జోసఫ్ హై స్కూల్ నందు సుమారుగా 184 మంది విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా చదువుతున్నారు. ప్రజెంట్ గా ఆ విద్యా సమస్యకు 1,70,00,000/- ఒక కోటి 70 లక్షల పాత బకాయి ఉండటం ద్వారా విద్యాసంస్థలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యాసంస్థ యాజమాన్యం వారి పైన ఉన్న సంస్థ ద్వారా మాట్లాడి పిల్లల బంగారు భవిష్యత్తు విద్యా సంవత్సరం మధ్యలో ఆపడం ద్వారా ఎంతో మంది విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతారని ఆలోచన చేసి ఈ విద్యా సంవత్సరం నందు కూడా బెస్ట్ అవైలబుల్ స్కీం చదువుతున్న పిల్లలకు రావలసిన స్కూల్ ఫీజులు లేకుండా, టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇవ్వటానికి కూడా ముందుకు వచ్చారు. అట్టి స్కూల్ యాజమాన్య విద్యాసంస్థకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియపరుస్తున్నాము. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేరే వేరే సమస్యలకు బడ్జెట్ రూపంలో డబ్బులు రిలీజ్ చేస్తుంది. మా వెనకబడ్డ ఎస్సీ దళిత పిల్లల చదువుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన బెస్ట్ అవైలబుల్ స్కీముకు నిధులు మంజూరు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి మంత్రి కూడా లేకపోవడం బాధాకర విషయం ఇకనైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు ప్రభుత్వము చొరవ తీసుకొని స్కూలుకు రావలసిన పాత బకాయిని వెంటనే రిలీజ్ చేయాలి అని స్కూల్ బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ కమిటీ కోరినారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, ప్రతాప్ బాబు, సురేష్, శ్రీనివాస్, రాంబాబు, శ్రీకాంత్, లక్ష్మణ్, రత్నబాబు, శాలిని, రూప, వెంకన్న, సుమంత్ బాబు, ఉపేందర్, శేఖర్, మహేష్ బాబు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, నాగరాజు, నాగబాబు, గోపి, వీరబాబు, అశోక్ కుమార్, ప్రకాష్, ఉపేందర్, రవి తదితరుల తోపాటు పేరెంట్స్ కమిటీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.