భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్
పొలిటికల్ పవర్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :-తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పేద విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ చేయకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటే పుస్తకాలు, యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టులు అందించాలని ప్రభుత్వమే నిబంధన పెట్టింది. కానీ ఈ ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచినా ఆగస్టు వచ్చినా ఇంకా చాలా మంది విద్యార్థులు చిరిగిన బట్టలతో, పాత యూనిఫామ్‌లతోనే బడికి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బంజారా, గిరిజన ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులు కొత్త యూనిఫామ్‌లు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఒకే ఒక్క సహాయం కూడా సకాలంలో అందకపోవడం వల్ల పిల్లల చదువులపై ప్రభావం పడుతోందని ఆయనఅన్నారు.పాఠశాలల్లో డ్రెస్ లేకపోవడం వల్ల విద్యార్థులు అవమానాలకు గురవుతున్నారు. ఇది విద్యాహక్కును కాలరాయడమే అవుతుందని దుర్గా ప్రసాద్ నాయక్ పేర్కొన్నారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, 15 రోజుల్లోగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్‌ల పంపిణీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుచేపడతామని హెచ్చరించారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని, వెంటనే నిధులు విడుదల చేసి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి మండల అధ్యక్షులు గూగులోత్ రమేష్ నాయక్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు కార్తీక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.