అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9 న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ ములకలపల్లి మండలంలో మూకమామిడి పంచాయతీ లో పాఠశాలల యూనిఫామ్ స్టిచ్చింగ్ హబ్ ను పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి విద్య చందన.ఈ సందర్బంగా స్టిచ్చింగ్ హబ్ లో ఎంత మంది టైలర్స్ కూడుతున్నారు. రోజుకు ఎన్ని యూనిఫామ్ లు కుడుతున్నారు మరియు ఏ ఏ పాఠశాలల యూనిఫామ్ లు కుడుతున్నారు అని వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా యూనిఫాములు తయారు కాకపోవడం ఈనెల ఆగస్టు 10 పదివ తారీకు లోగ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు ఒక జత యూనిఫామ్ తయారు చేయాలని మిగతా యూనిఫామ్ లు ఈనెల ఆగస్టు 13 పదముడివ తేదీ లోగ పూర్తిచేయాలని ఆదేశించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కాలేజీలకు ఒక జత యూనిఫాం తప్పకుండా అందించాలని టైలర్స్ లకు ఆదేశించారు.అనంతరం మూకమామిడి గ్రామపంచాయతీ లో నిర్మిస్తున్న గ్రామ సమైక్య భవనాలను విఓ బిల్డింగ్ పరిశీలించారు. అనంతరం స్థానిక సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి తో మాట్లాడుతూ…. ఈనెల చివరి వారంలోపు గ్రామ సమైక్య భవనాలను పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్ లకు తెలియజేయాలని సూచించారు. పంచాయితీలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోర్సఆదిలక్మి, ఎంపీడీఓ సత్యనారాయణ, ఈజీఎస్ ఏపీడి వెంకట రమణయ్య,ఏపీఎం రామ్ కుమార్, సీసీ కె వెంకటేశ్వర్లు, వివోఏ స్వయం లలిత, పంచాయితీ సెక్రటరీ దోమల అరుణ్ కుమార్ వివో అధ్యక్షురాలు, మహిళలు పంచాయితీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.