స్థానిక పోరుకు కర్నూలు సిద్ధం

కర్నూలు జిల్లా (పొలిటికల్ పవర్):అప్పయ్య. ఎమ్ ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో స్థానిక పోరుకు యంత్రాంగం పక్కాగా సిద్ధమైంది. మండల పరిధిలోని 44 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల ఇన్ఛార్జ్ అధికారి గోపాల్ వెల్లడించారు. మండల వ్యాప్తంగా మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా 67 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే కీలకమైన దేవనకొండ గ్రామంలో 6 ఓటింగ్ బూత్‌లను పక్కా ప్రణాళికతో సిద్ధం చేసినట్లు అధికారి తెలిపారు....