రూ.5.60 లక్షల వితరణ అందజేసిన తోటి స్నేహితులు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో రావూరి నాగేశ్వరరావు నాయుడు చేయి చేయికలిపి స్నేహబంధం చాటిన వేళ స్వార్థం, సంకుచితత్వం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఆ స్నేహితులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు.
భౌతికంగా ఈ లోకంలో లేని తన స్నేహితుని కుమార్తె వివాహానికి బాసటగా నిలిచారు. పన్నెండేళ్ళ కిందట కిందట మరణించిన తన స్నేహితుడు మెచ్చేలా మిత్ర ధర్మాన్ని ఈ లోకానికి చాటి చెప్పారు. “స్నేహమంటే ఇదేరా” అంటూ చేయి చేయి కలిపి చనిపోయిన స్నేహితుని కుటుంబ వివాహంలో వాళ్ళంతా పెళ్లి పెద్దలయ్యారు. ఖమ్మం నగరానికి చెందిన ఎండి మహబూబ్ అలీ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేసేవాడు. 2013లో ఆయన అకస్మాత్తుగా గుండె పోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పుడు మహబూబ్ అలీ కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. ఇదే సమయంలో ఖమ్మం జమ్మిబండ ప్రాంతంలోని జ్యోతి బా లమందిర్ 1986-87తెలుగు మీడియం బ్యాచ్ అతని పదవ తరగతి మిత్రులు తమ స్నేహ బంధాన్ని చాటుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. వివిధ రంగాల్లో ఉన్నతంగా స్థిరపడిన ఆ స్నేహితులు చేయి చేయి కలిపి అనూహ్యంగా లక్షల సొత్తును సేకరించారు. పదో తరగతిలో కలిసి చదువుకున్న తన స్నేహితుని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తలా కొంత సాయంగా వేసుకొని రూ.5.60 లక్షల మొత్తాన్ని కూడబెట్టారు. మంగళవారం ఖమ్మం లొ జరిగిన తమ స్నేహితుడి కుమార్తె వివాహంలో రూ.5.60 లక్షల మొత్తాన్ని అందజేసి వారంతా మిత్ర ధర్మాన్ని చాటి చెప్పారు. మహబూబ్ అలీ స్నేహితులైన ఎన్ ఆర్ ఐ లు డాక్టర్ సుధాకర్, నాగుబండి ముత్యాలరావు, చింతలపూడి శ్రీకాంత్, ఎం మాధవి, శివాజి, స్థానికంగా ఉంటున్న డాక్టర్ రామరాజు, ఆర్ సత్యనారాయణ, పవన్ తదితరులు ఈ వితరణ సేకరణను ముందుండి నడిపించడం హర్షణీయం. నిజంగా ఇదే కదా స్నేహం అంటే.! స్నేహానికి అర్ధం మారుతున్న ఈ కాలంలో ఎప్పుడో చనిపోయిన పదో తరగతి స్నేహితుడిని గుర్తు పెట్టుకుని ఆయన కుమార్తె పెళ్లికి తోటి స్నేహితులంతా సహకరించడం అద్భుతమే. పెళ్లి కూతురు అన్న అమన్ అలీ తొ మహమూద్ స్నేహితులు పెళ్లి కూతురు అన్న అమన్ అలీ తొ మహమూద్ స్నేహితులు