పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పాలేరు డివిజన్ రిపోర్టర్ ఎన్ రమేష్ బాబు: స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తితో ఏర్పడిన ఆత్మీయ స్నేహబంధాన్ని గుర్తు చేస్తూ నేలకొండపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు మాదాసు ఆదాం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రక్తసంబంధాలకన్నా కష్టసమయాల్లో అండగా నిలిచే స్నేహమే గొప్ప బంధమని పేర్కొన్నారు. భాషలు, ప్రాంతాలు, జీవన విధానాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఒకే ఆశయం, ఒకే సిద్ధాంతం, ఒక మహానాయకుడి స్ఫూర్తి ఎంతో మందిని ఒకే వేదికపైకి తీసుకువస్తుందని అన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన స్నేహబంధం పరస్పర విశ్వాసం, ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నేటి సమాజంలో సొంత బంధువులే దూరమవుతున్న సందర్భాల్లో, ఈ మిత్రబృందం ఒకరి కష్టసుఖాల్లో మరొకరు కుటుంబ సభ్యుల్లా తోడుగా నిలవడం అభినందనీయమని చెప్పారు. కందాళ ఉపేందర్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ప్రతి మిత్రుడికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే ఐక్యత, స్నేహం, పరస్పర సహకారం చిరకాలం కొనసాగాలని మాదాసు ఆదాం ఆకాంక్షించారు.