Date of Publish : 12 September 2026, 8:49 pmPosted by : POLITICAL POWER
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026:పెద్దమందడి: అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్దమందడి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డప్పు ధర్నా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు డప్పులు వాయిస్తూ నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల వ్యవహారశైలి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు డప్పు ప్రదర్శనలతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు డప్పు ప్రదర్శన నిర్వహించిన స్థలాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితులను అవమానించే చర్యగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.డప్పు ప్రదర్శన జరిగిన స్థలాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా నిరసించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని, రాజ్యాంగబద్ధమైన పదవులకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ నాయకుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజ్యాంగబద్ధ పదవులకు గౌరవం ఇవ్వాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.