స్మశాన వాటికకు దారిలేక శంభునిగూడెం ప్రజల నరకయాతన! 200 ఏళ్లుగా తీరని సమస్య.. నిర్మించిన వైకుంఠధామానికి వెళ్లలేని పరిస్థితి ఓట్ల కోసమే మమ్మల్ని వాడుకుంటున్నారు: స్థానికుల ఆగ్రహం అధికారులైనా స్పందించి దారి కల్పించాలని విజ్ఞప్తి
టేకులపల్లి (పొలిటికల్ పవర్/PN9 న్యూస్), నవంబర్ 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామంలో వైకుంఠధామానికి సరైన దారి లేక గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 200 సంవత్సరాలుగా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి దారి లేకపోవడంతో శవాలను మోసుకెళ్లేందుకు పడుతున్న నరకయాతన వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం గ్రామానికి వైకుంఠధామాన్ని (స్మశాన వాటిక) మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, దానికి వెళ్లేందుకు కనీస రహదారి సౌకర్యం కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో ఎవరైనా మరణిస్తే, వారి అంతిమ యాత్రను...