POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 1:45 pm Posted by : POLITICAL POWER

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 18 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మనిగిల్ల గ్రామంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు పరిశుభ్రంగా, అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామ పరిశుభ్రతను కేవలం గ్రామపంచాయతీ బాధ్యతగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ఇళ్లలో నిత్యవసరంగా వినియోగించే కూరగాయల వ్యర్థాలు, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డస్ట్‌బిన్లలో వేయాలని, అనంతరం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌కు అందించాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకోవాలని సర్పంచ్ సూచించారు. త్వరలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నాలుగు డస్ట్‌బిన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఎస్‌బీఎం జిల్లా కో-ఆర్డినేటర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్, పాఠశాల సిబ్బంది, జానయ్య, రాములు, గ్రామ పెద్దలు రాములు, వెంకటయ్య, శ్రీకాంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.