ఘనంగా పాస్టర్ తేజ మరియు పాస్టర్ బ్లేస్సి తేజ ఆధ్వర్యంలో ప్రార్థన కార్యక్రమం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్ లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో ప్రార్థన కార్యక్రమం జరిగింది.
ఈ ప్రార్థన కార్యక్రమానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయూఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా* ను ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ తేజ మరియు పాస్టర్ బ్లెస్సీ తేజ షేక్ బాజీ బాబా ను ఆ దేవుని కృపతో చల్లగా ఉండాలని, నలుగురికి సేవ చేసే అవకాశం దక్కినందుకు మరింత సేవ చేసే అవకాశం తో ముందుకు వెళ్లాలని, పేదవారి కష్టాలను అక్కున చేర్చుకొని వారికి అండగా నిలబడాలని,మీకు ఆ దేవుని కృపతో మరింత శక్తి తో ముందుకు సాగాలని ఆశీర్వదించడం జరిగింది.