POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 8:41 pm Posted by : POLITICAL POWER

హస్నాదిన్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 06 2026: వనపర్తి పట్టణంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు హస్నాదిన్ మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ నుంచి కోలుకొని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. పరామర్శించిన వాళ్లు టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, రాష్ట్ర మైనార్టీ నాయకులు కమర్ మియా, అక్తర్, గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనీష్ ,వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, పెద్దమందడి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు,సీనియర్ నాయకులు ఆసిఫ్ మియా, ద్వారాపోగు విజయ్ బాబు, నందిమల్ల రామ్ తదితరులు పాల్గొన్నారు.