
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21 2026: వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనీష్ హాజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని స్వస్థలమైన వనపర్తికి చేరుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ… హాజ్ యాత్ర ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని, అలాంటి మహత్తర యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన అనీష్ అభినందనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్, కమర్ మియా, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, సీనియర్ నాయకులు ద్వారపోగు విజయబాబు, నందిమల్ల రాము తదితరులు పాల్గొని అనీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.