హాలియా మున్సిపాలిటీ పరిధిలో స్మశాన వాటిక పరిశుభ్రత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చింతల. చంద్రారెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ రిపోర్టర్ ఎండీ జహీరుద్దీన్ హలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి హాలియాలోని ఇబ్రహీంపేట పాత బ్రిడ్జి సమీపంలోని స్మశాన వాటికను సందర్శించి పరిశుభ్రత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్మశాన వాటికలో పెరిగిన కంపచెట్లను జేసీబీ సహాయంతో తొలగించి, అక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో పూర్తిగా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయించారు. స్మశాన వాటికను ప్రజలందరికీ సౌకర్యవంతంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఉపయోగపడేలా అభివృద్ధి చేసి...