POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:22 pm Posted by : POLITICAL POWER

హైడ్రాలో రూ. 10.80 కోట్లు స్కాం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీ వ్యవహారంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి కాలేజీకి రూ. 6 లక్షలు చొప్పున 180 కాలేజీల నుంచి సుమారు రూ. 10.80 కోట్లు వసూళ్లు తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా అధికారుల వరకు జోరుగా పంపకాలు ఇంటర్ విద్యా కార్యదర్శి గుర్తించే వరకు బయటపడని హైడ్రా నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీల స్కాం ఈ స్కాంలో హైడ్రా అధికారులతో పాటు సిబ్బంది పాత్ర ఉన్నట్లు వినిపిస్తున్న ఆరోపణలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలిసే ఈ స్కాం జరిగినట్లు వ్యక్తమవుతున్న అనుమానాలు ఏటా ఇదే తంతు.. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీతో యథేచ్ఛగా కాలేజీలకు ఎన్‌వోసీలు అగ్నిమాపక విభాగాన్ని హైడ్రాలో విలీనం చేసిన తర్వాత మొదలైన నకిలీ ఎన్‌వోసీల తంతు కాలేజీ భవనాలన్నీ 15 మీటర్ల లోపు ఉండటంతో వసూళ్ల దందాతో రెచ్చిపోయిన వైనం 6 నెలల క్రితమే నకిలీ ఎన్‌వోసీలపై అందిన ఫిర్యాదులు.. పట్టించుకోని హైడ్రా అధికారులు తాజా తనిఖీలతో స్కాం బట్టబయలు.. ఇప్పటికీ కాలేజీల జాబితాను రహస్యంగా ఉంచిన హైడ్రా