POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 11:59 am Posted by : POLITICAL POWER

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపు ఆదేశాలు సరైనవే

కోర్టులు తప్పుదోవ పట్టడంలేదు, ప్రభుత్వ అధికారులే కోర్టులను తప్పు దోవ పట్టించాలని యత్నిస్తున్నారు

కోర్టులు తప్పుదోవ పడుతున్నాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన న్యాయమూర్తి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్ 60లోని 350 గజాల తమ భూమిలోకి హైడ్రా అక్రమంగా ప్రవేశించి, ఎలాంటి నోటీసులు లేకుండా ప్రహరీ గోడను కూల్చివేసిందని హైకోర్టును ఆశ్రయించిన సుధారాణి అనే మహిళ ఈ పిటిషన్‌పై గతంలో విచారించగా, తహసీల్దార్ ఆదేశాలతోనే కూల్చివేశామని కోర్టుకు తెలిపిన హైడ్రా కోర్టు ఆదేశాల మేరకు నిన్న కోర్టులో హాజరై, తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, సర్వే నంబర్ 58లోని ప్రభుత్వ భూమి గురించి ఆదేశాలు ఇస్తే, సర్వే నంబర్ 60లోని ప్రైవేట్ భూమిలో కూల్చివేతలు చేపట్టారని తెలిపిన తహసీల్దారు దీంతో ప్రైవేట్ భూమిలోకి అక్రమంగా చొరబడడమే కాకుండా, కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి “అసలు హైడ్రాకు అంత అత్యుత్సాహం ఎందుకు? నోటీసులు ఇచ్చేవరకు ఆగలేరా? ప్రైవేట్ భూములపై పెత్తనం ఎందుకు? మీ వెనుక ఏదైనా శక్తి ఉండి ఒత్తిడి చేస్తుందా? చట్టవ్యతిరేకంగా కూల్చివేతలు ఎలా చేపడతారు?” అంటూ మండిపాటు హైడ్రా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తుందా? ఎవరినీ లెక్క చేయకుండా, కోర్టు ఆదేశాలు కూడా పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టడం ఏంటి? అంటూ ఆగ్రహం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని సోదర జడ్జి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము కొందరు నాయకులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు అంటున్నారు, కానీ నిజానికి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ అధికారులే కోర్టును తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారు, న్యాయవ్యవస్థపై అలా మాట్లాడడం సరికాదు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన న్యాయమూర్తి ప్రస్తుత పిటిషన్ వ్యవహారంలో తదుపరి ఆదేశాల వరకు భూమిలోకి హైడ్రా వెళ్లకూడదని, విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు