POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:28 pm Posted by : POLITICAL POWER

హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్ 10 2026: హైదరాబాద్ గత వారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పెద్దమునగల్‌చెడు గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా యుగంధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. యుగంధర్ రెడ్డి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.