⚖️ హైకోర్టు ఆర్డర్స్ బేఖాతర్.. విద్యానగర్ భూముల్లో ‘ధన దాహం’! సర్వే నంబర్లు 161/2, 161/3 ల్యాండ్స్ లో మళ్ళీ ప్లాట్ల దందా.. అధికారుల మౌనం వెనుక మతలబేంటి? సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న భూ బకాసురులు!

  చుంచుపల్లి / భద్రాద్రి కొత్తగూడెం (పొలిటికల్ పవర్ ప్రత్యేక ప్రతినిధి నాగరాజు రెడ్డి ): న్యాయస్థానం ఆదేశించినా లెక్కలేదు.. పంచాయతీ నోటీసులు ఇచ్చినా కనీస భయం లేదు! చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ధీమాతో, అమాయక ప్రజల శ్రమకోర్చి దాచుకున్న సొమ్మును కొల్లగొట్టేందుకు భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 161/2, 161/3 భూములు ప్రస్తుతం రియల్ మాఫియాకు, అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. పక్కాగా న్యాయపరమైన వివాదాల్లో...