📰 పేదల ఇళ్ల హక్కులపై కుట్రలు… ఎమ్మెల్యే డ్రామాలకు తెరపడాలి: డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ఫైర్
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే06:తూర్పుగోదావరిజిల్లా అనపర్తి :పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆరోపణలు చేశారు.విజిలెన్స్ విచారణ పేరుతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. విచారణలో ఏమీ తేలకముందే పచ్చ పత్రికలకు వివరాలు లీక్ కావడం వెనుక ఉద్దేశ్యం...