పే అప్‌గ్రేడేషన్, పీఆర్పీ చెల్లింపుల కోసం కొనసాగుతున్న నిరసన
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని అధికారుల స్పష్టం
పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సమస్యల పరిష్కారం కోసం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దీక్షలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9:25 గంటల నుంచే అధికారులు దీక్షా శిబిరంలో కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ సుదీర్ఘకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా పే అప్‌గ్రేడేషన్, అలాగే ఉద్యోగుల జీవితంలో కీలకమైన పీఆర్పీ (PRP) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. నేటి దీక్షలో పాల్గొన్న అధికారులు: కె.వి. అనిల్ కుమార్ – ఎస్‌సీ, జేవీఆర్ ఓసీపీ డి. సూర్యప్రకాశ్ – ఎస్‌ఈ, కిష్టారం ఓసీపీ యు. సాయి శ్రవణ్ – డిప్యూటీ ఎస్‌ఈ, జేవీఆర్ ఓసీ సీహెచ్‌పీ ఈ అధికారులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.