POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:17 pm Posted by : POLITICAL POWER

మహిళల భద్రత కోసమే షీ టీం

మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్

జూన్పొ  6 : లిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్: మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ షీ టీం నేర్పాట చేయడం జరిగిందని మంచిర్యాల డిసిపి భాస్కర్ అన్నారు. లక్షెటిపేట పట్టణంలోని గార్డెన్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభ( వార్డు సభ) లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ మహిళలను ఆకతాయిలు వేధించిన వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫోన్ చేసిన క్షణాల్లో పోలీసులు అక్కడ చేరుకుంటారని ఫోన్ చేసిన వారి వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతారన్నారు. ఇటీవల గంజాయితో యువత చెడిపోతుందని మన ప్రాంతంలో ఇప్పటికే గంజాయి సేకరించిన విక్రయించిన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఎవరి పైన గంజాయి తాగినట్లు విక్రయించినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గంజాయి మత్తులో యువత చెడిపోవడం కాకుండా వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాళ్ళ జీవితాలను బాగు చేసే వాళ్ళం కావాలంటే తప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కాకుండా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ఇబ్బందులు పడతామని వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలన్నారు. గ్రామ సభకు హాజరైన డీసీపీ ని మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నరసయ్య కమిషనర్ విజయ్ కుమార్ తో పాటు వార్డు కౌన్సిలర్లు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దిలీప్ కుమార్ లక్షట్టిపేట ఎస్సై గోపతి సురేష్. షీ టీం ఎస్సై హైమ ఏవో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.