ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ.
పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
నస్పూర్ : ప్రణాళిక లో భాగంగా ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని 27వ డివిజన్ లో ఏర్పాటు చేసిన వార్డు సభా కార్యక్రమానికి మంచిర్యాల వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు డివిజన లో పారిశుధ్య, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేయడం,నీటి సరఫరా,రోడ్ల మరమ్మతులు,విద్యుత్ దీపాల సమస్యలు,శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియచేశారు.
కార్పొరేషన్ అభివృద్ధి కొరకు గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో అబివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ,రానున్న రోజుల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య నస్పూర్ సీనియర్ పోలీస్ కానిస్టేబుల్ శివ ప్రసాద్, అధికారులు, డివిజన్ ఆఫీసర్స్ ,మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
