POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 7:36 pm Posted by : POLITICAL POWER

ప్రభుత్వ బడుల్లో చేర్పించండి..

సామాజిక వేత్త డాక్టర్ మంజుల సాగంటి

 

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఎన్నో మౌలిక సదుపాయాలున్న ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించి నాణ్యమైన విద్యను వారికి అందించాలని సామాజిక వేత్త డాక్టర్ మంజుల సాగంటి తల్లిదండ్రులని కోరారు..

అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, ప్రయోగ శాలలు, లైబ్రరీలు, ఆటస్థలాలు వంటి మౌలిక వసతులు, ఉచిత విద్య, ఇంగ్లీష్ మీడియం లో బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, పౌష్టికాహార మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ వంటి సంక్షేమ పథకాలు, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఉన్నత ప్రమాణాలతో అర్హత అనుభవం కలిగి, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యను అభ్యసించే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తెలిపారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు భవిషత్తు లో ఉన్నత విద్య అవకాశాల్లో , ఉద్యోగ అవకాశాల్లో అధిక ప్రయోజనం ఉంటుందని ఆమె అన్నారు…