POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:06 pm Posted by : POLITICAL POWER

ప్రజల కోసం ప్రభుత్వం నిరంతరం పని చేస్తుంది.

 

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గూడెంలో గల శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గార్ల తో కలిసి శంకుస్థాపన చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..

 

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2 వేల 216 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నామని, సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, రాబోవు గోదావరి పుష్కరాలలో పుష్కర ఘాట్ల నిర్మాణం, అవసరమైన వసతుల కొరకు 1 వేయి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. బాసర నుండి భద్రాచలం వరకు 802 కోట్ల రూపాయలతో ఆధ్యాత్మిక కారిడార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు 70 కోట్ల రూపాయల నిధులతో గూడెం దేవాలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని, పిప్రి వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి చే గూడెం ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి 37 రోజుల వ్యవధిలోనే పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక క్షేత్రాల పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా గూడెం గుట్ట పరిధిలో 74 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్యం, వ్యవసాయ, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధిలో నియోజకవర్గ శాసనసభ్యులు కృషి అభినందనీయమని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తులో ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

 

రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి మాట్లాడుతూ దేవాదాయ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. రాబోవు గోదావరి పుష్కరాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

 

మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలో ఏ ఒక్క పంట ఎండిపోలేదని, ప్రకృతితో కలిసి జీవిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

 

అనంతరం పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 9 కోట్ల 70 లక్షల రూపాయల మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సంఘ భవనాల నిర్మాణం, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో 2 కోట్ల 30 లక్షల రూపాయల నగరాభివృద్ధి నిధులతో సి.సి. రోడ్డు పనులు, 2 కోట్ల రూపాయలతో మురుగునీటి కాలువ నిర్మాణ పనులు, దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం పరిధిలో 58 ఓట్ల రూపాయల అంచనా నిధులతో ఆలయ పున: నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు, లక్షెట్టిపేట, దండేపల్లి మండలాలలోని మోదెల, ద్వారక, గుడి రేవు గ్రామాల సమీపంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడమవైపున 74 కోట్ల 40 లక్షల రూపాయల అంచనా నిధులతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

 

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ గారు, మక్కన్ సింగ్ ఠాకూర్ గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు, మంచిర్యాల, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు , వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..