జర్నలిస్టులకు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం – సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో జర్నలిస్టులకు సొసైటీల పేరుతో కాకుండా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శనివారం జర్నలిస్టులతో జరిగిన భేటీలో సీఎం మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే సంకల్పంతోనే కేబినెట్ సబ్ కమిటీ వేశాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్...