POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 6:17 pm Posted by : POLITICAL POWER

ట్రస్ట్ సేవలు అభినందనీయం..

జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్..

జూన్పొ 30 : లిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

జన్నారం మండలం.  నిరుపేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న “రిలయబుల్” ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎస్సై ఉదయ్ కిరణ్ అన్నారు. జన్నారం మండలంలోని రాంపూర్ జడ్పి ఉన్నత పాఠశాలలో రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలోని 380 విద్యార్థులకు రూ.2 లక్షల విలువైన విద్యా, క్రీడా సామాగ్రి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి పేద విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా విద్యా సామగ్రి అందజేయడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో, క్రీడల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం ప్రభావతి, సర్పంచ్ నూతి రామయ్య, ఉప సర్పంచ్ ఒడ్డేటి వెంకటేష్, తిమ్మాపూర్ సర్పంచ్ గుగ్లవత్ సంగీత రవి, ఉప సర్పంచ్ వేముల నాగేష్, తాళ్లపేట మాజీ ఎంపీటీసీ కంది హేమలత  సతీష్ కుమార్, రిలయబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తుపాకుల రవి, గుమ్మడి రాజలింగు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ గుమ్మడి కిరణ్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సుమలత, స్థానిక నాయకులు ఉన్నారు.