*_నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ_* పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభిస్తోంది.ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నారు.పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అర్హులైన చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి, నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించనున్నారు.