టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన
జులై 23 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పై గురువారం నాడు లక్షెట్టిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీ లో ఎన్ ఎస్ ఎస్ విభాగం విద్యార్థిని ,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని టీబీ సూపర్ వైజర్ సురేష్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ , టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు విద్యార్థులకు మోబైల్ ఫోన్ లలో టీబీ నిశ్చయ్ ఆప్ ఇన్స్టాల్ చేసి దాని గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ ఐవి ఎయిడ్స్ గురించి కౌన్సిలర్ ఆంజనేయులు మరియు సీజనల్ వ్యాధుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై వెంకట్రావ్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ గఫూర్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ ,ఎన్ ఎస్ ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మాధవి సంతోష్ ,లెక్చరర్స్ శ్రీనివాస్, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

