POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 3:08 pm Posted by : POLITICAL POWER

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షలో పేపర్ లీక్‌, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.  నీట్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు నిరసనలు చేపట్టి, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026 ముసాయిదాను విడుదల చేసి, పేపర్ లీక్‌లు, పరీక్షల అక్రమాలపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కాలపరిమితిలో విచారణ వంటి కీలక నిబంధనలను ప్రతిపాదించింది. అంతేకాదు, మరో అడుగు ముందుకు వేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇప్పుడు ఈ వివాదానికి శాశ్వత పరిష్కారంగా నిలిచింది. మరోవైపు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. అయితే రాజీనామాపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, రాష్ట్రపతి ఆమోదం, తదుపరి బాధ్యతల కేటాయింపుపై పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, విద్యార్థి సంఘాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, దీర్ఘకాలిక సంస్కరణలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.