15 ఏళ్ల నీటి గోసకు తెర గోపాలపురంలో పుష్కలంగా ఉబికిన జలాలు

పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 1: దమ్మపేట మండలం జమేదార్ బంజార్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామ ప్రజలను సుమారు 15 ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవతో చేపట్టిన నూతన బోరుబావి డ్రిల్లింగ్‌ విజయవంతం కావడంతో భూగర్భం నుంచి పుష్కలంగా నీరు లభ్యమైంది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత పదిహేనేళ్లుగా గోపాలపురం గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మూడు పర్యాయాలు బోర్లు వేసినా నీరు...