ఆదివాసి అస్థిత్వ సమరంలో అడవి గుండె చప్పుడు (ఆగష్టు 9న అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పొలిటికల్ పవర్ న్యూస్ ప్రత్యేక వ్యాసం) అడవితో మాట్లాడటం నాగరిక ప్రపంచానికి తెలియకపోవచ్చు, కానీ ఆదివాసీకి అదొక మాతృభాష. ఆగస్టు 9 అనగానే క్యాలెండర్లలో ఒక ఐక్యరాజ్యసమితి దినోత్సవం గుర్తొస్తుంది. ఉపన్యాసాలు, సదస్సులు, కొన్ని హామీలు.. మరుసటి రోజుకి మళ్లీ పాత చట్రమే. కానీ, ఆదివాసీల దినోత్సవాన్ని కేవలం ఒక జ్ఞాపకంగా కాకుండా, ఈ భూగోళం తనను తాను కాపాడుకోవడానికి వేసుకునే ఒక ‘ఆత్మపరిశీలన రోజు’గా చూడాల్సిన...