ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక యదార్థ సంఘటన
ఆగస్టు 7 : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ పరిశోధనాత్మక కథనం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ మాదిగల కోసమే పనిచేస్తున్న మేము అని చెప్పుకుంటూ తిరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదా తెలిసినా తెలియనట్టు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన దాడులు దౌర్జన్యాలు దళితులు పెట్టిన కేసులను పోలీసు అధికారులు తీసుకోవడం లేదు దీనికి కారణం ఎవరు ? భారతదేశంలో ప్రత్యేకంగా దళితుల రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి అవి పోలీస్ అధికారులకు తెలియవా రాజ్యాంగంలో వారికి కొన్ని హక్కులు కల్పించింది కదా ఆ హక్కులతోనైనా వారు పెట్టే వారు చేసే ఫిర్యాదులను ప్రభుత్వ పోలీస్ అధికారులు పరిశీలన చేయాలి కదా ఖమ్మం జిల్లాలో ప్రముఖ మంత్రి అనుచరులము మమ్మల్ని ఏసీపీ ఏం చేయలేడు సిపి ఏం చేయలేడు అని చెప్పుకొని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక ముఠాకు కొమ్ముకాస్తున్న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుడు ఫిర్యాదు ఇచ్చి వారం రోజులు గడుస్తున్నా కూడా కేసు ఫైల్ చేయకుండా బాధితులకు న్యాయం చేయకుండా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది మంత్రి అనుచరులమని చెప్పుకొని ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లాలో 20 సంవత్సరాల నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వలస వచ్చిన వలసవాదులు ఇక్కడ భూ కబ్జాలు గేదలు అర్ధరాత్రి కబేలాలకు తరలించడం ల్యాండ్ రాబరీ పెత్తనాలు చలాయిస్తూ భూ దందాలు చేస్తున్న వారి మీద ముపైకి పైగా కేసులు ఉన్నా కూడా పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవట్లేదు అలాగే ఈ మధ్యకాలంలో ఒక దళితుడు వివాదం విషయంలో తన దగ్గర ఉన్న మహేంద్ర తార్ కారును సదరు ముట బలవంతంగా తీసుకోవడం జరిగింది . ఇది ఏంటి అని ప్రశ్నిస్తే మేము మంత్రి అనుచర్లము మీ దిక్కున చోట చెప్పుకోండి మీరేం చేయాలనుకుంటే అది చేసుకోండి మమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ విషయమై ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదుదారులకు ఇంతవరకు న్యాయం చేయని పోలీస్ అధికారులు ఒక మూడు నెలల క్రితం ఇలాంటి కేసే ఒకటి ఎఫ్ఐఆర్ చేసి ఒక వ్యక్తిని అక్రమంగా రెండు నెలలు జైల్లో పెట్టడం జరిగింది అంటే ఇక్కడ దళితులు ఎస్సీ మాదిగోల్లకు ఒక న్యాయం మిగతా వారికి ఒక న్యాయం నడుస్తోంది ఈ స్టేషన్లో ఈ పద్ధతి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అంటే దళితులకు అయితే కార్లు ఉండకూడదా అనేది తెలియని విషయం మరో విషయం ఏంటంటే పోలీసు అధికారులు బాధితుడు వెళ్లి కలవగా మీ నాన్న పెద్ద 420 నీకు కార్ ఎక్కడిది రా అని కించపరిచినట్టు మాట్లాడడం కోసం మెరుపు ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారుల మీద గతంలో కూడా ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి అయినా కూడా ఖమ్మం జిల్లా సిపి కానీ ఖమ్మం రూరల్ ఎసిపి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకిలా జరుగుతుంది . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రిగా ఉన్న ఇలాకలొ ఇలాంటివి కోకొల్లలుగా జరుగుతున్నాయి దళితుల మీద అక్రమ కేసులు పెట్టాలని మరియు పెడుతున్నారు ఎందుకు ఒక వర్గాన్నిలా ఎందుకు చేస్తున్నారు సమాజంలో వాళ్లు బతకకూడదా సమాజంలో వాళ్ళు ఉండకూడదా అయితే ఒకలాగుంటదా? వేరే ఇలాకైతే ఇంకోలాగా ఉంటదా . మరో విషయం ఏంటంటే బాధితుడిని కించపరుస్తూ బాధపెడుతున్నారు ఎందుకిలా జరుగుతుంది ఇకనైనా సదురు ఏసిపి రూరల్ ఏసిపి ఈ విషయాన్ని ఈ సంఘటనను పరిగణంలోకి తీసుకొని ఎస్సి మాదిగ బాధితుడికి న్యాయం చేయాలని పొలిటికల్ పవర్ యాజమాన్యం తరఫున కోరుకుంటున్నాము కొసమెరుపు ఏంటంటే మీ నాన్న పెద్ద 420 నీకు కార్ లేదు ఏం లేదు పోరా బయటికి అని పోలీస్ అధికారులు బాధితుడిని అనడం కోసం ఎరుపు బాధితుడు తనకు జరిగిన బాధను నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకునే పనిలో ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము పేదల పక్షపాతులము పేదలకు మాత్రమే న్యాయం చేస్తాము అని చెప్పుకొని ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు కనిపించడం లేదా వారికి తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఏం సందేశం ఏం భరోసా కల్పిస్తున్నట్టు మరో విషయం ఏంటంటే పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రతినిధి వెళ్లి ప్రశ్నించగా మా స్టేషన్ లో మాకు అన్ని తెలుసు మేము కేసు కట్టాలా కట్టకూడదో మీరెవరు మాకు చెప్పటానికి ముందు మీరు స్టేషన్ నుంచి బయటికి వెళ్ళండి అని అనటం కోసం మెరుపు మీడియా వ్యక్తివి నీ మీద అక్రమ కేసు పెట్టాల్సి ఉంటుంది అని బెదిరిస్తున్నారు.
