POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 2:48 pm Posted by : POLITICAL POWER

ఒమన్‌-మస్కట్ లో మృతి చెందిన మృతదేహం తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి-(TGWWC) టీజీ డబ్ల్యూ డబ్ల్యూ సి అండతో స్వదేశానికి తరలింపు

 

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం, నర్మాల గ్రామా వాసి గరిగంటి శ్రీహరి (45) గత 10 సంవత్సరాలుగా ఒమన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు కంపెనీ సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం, జీతాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో అత్యవసర సెలవుపై స్వదేశానికి వెళ్లారు. సెలవు ముగించుకొని మూడు నెలల అనంతరం తిరిగి మస్కట్ వచ్చిన శ్రీహరి, గతంలో పనిచేసిన కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా (చట్టవిరుద్ధంగా) మరో కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. ఒమన్‌లో స్థానికంగా దీనిని “కళ్లివెళ్లి” అని అంటారు. స్పాన్సర్‌కు తెలియకుండా మరో కంపెనీలో పనిచేయడం ఒమన్ కార్మిక చట్టాల ప్రకారం నిబంధనలకు విరుద్ధం.

శ్రీహరి మరో కంపెనీలో విధులు నిర్వహిస్తూ ఉండగా తేదీ 29/07/2026 బుధవారం ఒక్కసారిగా తీవ్రంగా చెమటలు రావడంతో అస్వస్థకు గురయ్యారు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని తోటి కార్మికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చట్ట విరుద్ధంగా మరో కంపెనీలో పనిచేసిన శ్రీహరి మృత దేహాన్ని స్వదేశానికి పంపడానికి ప్రభుత్వ అధికారులు, అలాగే గతంలో పనిచేసిన మొదటి కంపెనీ స్పాన్సర్ కూడా మృతదేహం తరలింపు బాధ్యత తీసుకోవడంలో వెనుకంజ వేశారు.

ఈ విషయాన్ని శ్రీహరి కుటుంబ సభ్యులు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి-TGWWC మస్కట్ కోఆర్డినేటర్ గోగు దేవరాజు కు తెలియపరిచారు. దేవరాజు వెంటనే TGWWC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్ కు సమాచారం అందించి ఇద్దరూ భారత రాయబార కార్యాలయం, సంబంధిత అధికారులు మరియు శ్రీహరి గతంలో పనిచేసిన మొదటి స్పాన్సర్‌తో సంప్రదింపులు జరిపారు. చట్టపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో శ్రీహరి మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సహకరించాలని స్పాన్సర్ను కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన సంబంధిత అధికారులు అవసరమైన పత్రాలు సిద్ధం చేయడంలో సహకరించడంతో, శ్రీహరి మృతదేహాన్ని అతి తక్కువ సమయంలో స్వదేశానికి తరలించడం జరిగిందిని పాలజీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా పాలాజీ శ్రీనివాసు, గోగు దేవరాజు, మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అండగా నిలవడమే TGWWC లక్ష్యం. మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి సాధ్యమైనంత సహాయం అందించేందుకు TGWWC ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.

అలాగే తెలంగాణ సచివాలయంలోని NRI విభాగంతో సంప్రదించి హైదరాబాద్ విమానాశ్రయం నుండి స్వగ్రామానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి అలాగే చట్టపరమైన ఇబ్బందులను అధిగమించి, శ్రీహరి మృతదేహాన్ని త్వరితగతిన స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన TGWWC మస్కట్ కోఆర్డినేటర్ గోగు దేవరాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలాజీ శ్రీనివాస్, ఓమన్ శాఖ అధ్యక్షులు జావుడల సత్తన్న ను శ్రీహరి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు TGWWC సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.