మల్కాజిగిరిలో ఎస్సీ వ్యక్తిని కుల దూషణ... రద్దీగా ఉన్న రోడ్డుపై చెప్పుతో కొట్టి భౌతిక దాడి!! మల్కాజిగిరి: 11 ఆగస్టు (పొలిటికల్ పవర్ న్యూస్) హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో షెడ్యూల్డ్ కులానికి (మాల) చెందిన ఒక కార్ డ్రైవర్ పై తీవ్రమైన కుల వివక్ష, భౌతిక దాడి మరియు ప్రాణ బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుడైన సాయి కిరణ్ (36) తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అతని కులాన్ని నిందిస్తూ సమాజంలో...