*సీఎం రేవంత్ సభ ఏర్పాట్ల పై అధికారులు, ముఖ్య నాయకులతో సమావేశమైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ రాష్ట్ర ఎడిటర్ బి చంద్రశేఖర్
ఈ నెల 15 న సంగారెడ్డి లో సిఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యం లో సంగారెడ్డి పట్టణం లోని ఐబీ గెస్ట్ హౌజ్ లో పోలీస్ అధికారులు, ముఖ్య నాయకులతో జగ్గారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమావేశం అయ్యారు. సీఎం సభ కు జనసమీకరణ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం ఐఐటీ లోని హెలిప్యాడ్ నుండి బయలుదేరి నేరుగా ఐబీ చౌరస్తా వద్దకు చేరుకుంటారని అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ల విగ్రహాలను ఆవిష్కరిస్తారు అని తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఉమ్మడి జిల్లా నుండి వచ్చే లబ్ధిదారులు, కాంగ్రెసు నాయకులు కార్యకర్తల వాహనాల కోసం గంజి మైదాన్, మెడికల్ కాలేజీ లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే లు, మంత్రుల వాహనాల ను డీఈవో కార్యాలయం లో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఒక్క సంగారెడ్డి నియోజకవర్గం నుండి నలభై నుండి యాభై వేలమంది ని సభ కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. అధికారులు ఇరవై వేల మంది లబ్ధిదారులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నారాయణ్ ఖేడ్ నుండి ఐదువేలు , ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి కలుపుకుని మొత్తం లక్షమందిని సభ కు తరలించేలా ప్లాన్ చేస్తున్నట్లు జగ్గారెడ్డి, సంజీవ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులురఘు గౌడ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
