POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 9:51 pm Posted by : POLITICAL POWER

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ఆగస్టు 13 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం లో గంజాయి కేసులో వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులైన అన్నదమ్ములు పోతు గురువయ్య, పోతు మల్లేష్ లను గురువారం అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులను విచారించగా అలవాటు పడి పోతు మల్లేష్ అనే నిందితుడు గత మూడు నెలల క్రితం మహారాష్ట్ర చంద్రపూర్ నుండి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి ఇరువురు కలిసి దానిని సేవించి అందులో వచ్చిన గింజలను వారి పంట పొలాల్లో చల్లి గంజాయి మొలిస్తే ఇక్కడి ప్రాంతం వాళ్లకు అమ్మి సులువుగా డబ్బు సంపాదించాలని పథకం ప్రకారం గింజలు రెండు మొక్కలు నాటాయి. నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఇంటి పరిసరాలు సోదాలు నిర్వహించగా నిందితులు ఇద్దరు వద్ద సుమారు నాలుగు గంజాయి ప్యాకెట్లతో పాటు పరిసరాల్లో గింజలు వేయగా మొలిచిన రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరు అన్నదమ్ములపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది.