సమాజ సేవకులు ఆర్యవైశ్యులు
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య
మండల ,పట్టణ, కమిటీల ఎన్నిక
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి సతీష్
లక్షెట్టిపేట్ : ఈరోజు సమాజ సేవలో ఆర్య వైశ్యులు ఎల్లవేళలా ముందు ఉంటారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం ఆర్యవైశ్య భవన్ లో వైశ్య సంఘం మండల కమిటీ, ఆర్యవైశ్య మహిళా సంఘం పట్టణ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్యులు అని అన్నారు. తమ వ్యాపారాలు చేసుకుంటూనే సంఘ కార్యక్రమాల లో సైతం చురుకుగా పాల్గొంటూ ఉంటారన్నారు. అనంతరం నూతన మండల కమిటీ అధ్యక్షునిగా వెంకట్రావు పేట గ్రామానికి చెందిన గౌరిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా కట్కం అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొంజర్ల ప్రసాద్,లను అలాగే మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలిగా నరేందుల సాహితి, ప్రధాన కార్యదర్శిగా పల్లెర్ల ఆరతి, కోశాధికారిగా కాసం స్వప్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎనగందుల శరణ్య, ఉపాధ్యక్షులుగా సామ లావణ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బోనగిరి దీపిక, కల్చరల్ సెక్రటరీగా శిదురాల సోనీ, జాయింట్ సెక్రటరీగా సామ జయ, గౌరవ సలహాదారులుగా కొత్త వజ్రకల, చెట్ల రమ్య, ఉత్తూరి రజిత, కార్యవర్గ సభ్యులుగా రావి కంటి సుమలత, బండారి తేజస్వీ, ఇగం కవిత, గుండ లతా శ్రీ , ఇందిరా జైన స్రవంతి, చిట్టిమల్ల విజయ ,వొజ్జల సరిత, సీహెచ్ సౌజన్య, నల్మాస్ మనీషా,దొంతుల భవానీ, లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండా బుచ్చన్న, పట్టణ అధ్యక్షులు చెట్ల రమేష్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్ ,నాయకులు ఓజ్జల రాజమౌళి, నల్మాస్ శ్రీనివాస్, గడ్డం వికాస్ , కొంజర్ల శ్రీనివాస్,గుండ ప్రభాకర్,వొజ్జల శ్రీనివాస్, చింతల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
