POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 8:00 am Posted by : POLITICAL POWER

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026: పెద్దమందడి 18 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా పెద్దమందడి డిప్యూటీ తహసిల్దార్ గౌస్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పెద్దమందడిలో పత్రాలను పరిశీలించిన ఆయన, ఈ సందర్భంగా ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ గౌస్ మాట్లాడుతూ… 18 సంవత్సరాలు నిండిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని తెలిపారు .అర్హత ఉన్న యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పత్రాల పరిశీలనను అధికారులు చేపడుతున్నారని, ప్రజలు అధికారులకు అవసరమైన సహకారం అందించాలని డిప్యూటీ తహసిల్దార్ గౌస్ కోరారు. ఈ కార్యక్రమంలోని జిపి వేమారెడ్డి. బి ఎల్ వో లు రమాదేవి. తదితరులు పాల్గొన్నారు.