POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 9:27 pm Posted by : POLITICAL POWER

రంగా విగ్రహావిష్కరణకు ఆహ్వానం

*23న అశ్వారావుపేటలో కార్యక్రమం

*చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళకు ఆహ్వానం

*వైస్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి రమేష్‌బాబుకు ఆహ్వానం

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 21)

అశ్వారావుపేటలో ఈ నెల 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి శశికళ, వైస్‌ చైర్‌పర్సన్‌ జూపల్లి రమేష్‌బాబులను మున్నూరు కాపు సంఘం నాయకులు ఆహ్వానించారు.ఈ మేరకు వారి నివాసాలకు వెళ్లిన సంఘం నాయకులు ఆహ్వాన పత్రాలను అందజేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగా ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు, సంఘం నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.