మూగజీవాల వైద్యానికి దిక్కేది? *పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత *అపరిశుభ్ర వాతావరణంలో సేవలు *సకాలంలో వైద్యం అందించాలని వేడుకోలు పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 21)   అశ్వారావుపేట: పశువులకు సకాలంలో వైద్యం అందించాల్సిన పశువైద్యశాలలు అశ్వారావుపేట మండలంలో సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలు గ్రామాల్లోని పశువైద్యశాలలు సక్రమంగా పనిచేయకపోవడంతో పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. కొన్ని చోట్ల వైద్యశాలలు తెరుచుకోకపోవడం, పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని అంటున్నారు.   మండలంలోని పలు...