* 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి?
* ఖబడ్దార్ బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు మండల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డిని హెచ్చరించిన పాలడుగు వెంకటకృష్ణ..
తేది: 23.08.2026 ఆదివారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశములో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు పాల్గొని ములుగు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డి 39 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కొత్తగూడలో మంత్రి సీతక్క గారు మాట్లాడి ఆరు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు రమేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. “ఆ విషయం మీద స్పందించాల్సి ఉంటే అప్పుడే స్పందించాలి. ఇన్ని రోజుల తర్వాత పాత ఘటనను తెరపైకి తీసుకురావడం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం ఉంది?” అని నిలదీశారు.
మీ పార్టీ నాయకుడు ఏరువా అలియాస్ గుంటూరు సతీశ్ రెడ్డిపై ఇసుక కాంట్రాక్టర్లను బెదిరించి, చక్రపాణి అనే మధ్యవర్తి ద్వారా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా అని వెంకటకృష్ణ అన్నారు.
“రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని, అందులో రూ.1.80 కోట్ల నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా. నిజంగా అది అవాస్తవం అయితే సతీశ్ రెడ్డి ప్రజల ముందు స్పష్టమైన వివరణ ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వట్లేదు. ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
అసలు ఈ నగదు తీసుకున్న వాస్తవాలను కప్పి పుచ్చడానికి, వాటికి సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారా? అని రమేశ్ రెడ్డిని ప్రశ్నించారు.
“ఈరోజు సీతక్క గారి వయసు సుమారు 53–54 సంవత్సరాలు. 39 సంవత్సరాల క్రితం ఆమె వయసు సుమారు 14–15 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో ఒక బాలిక ఏ స్థాయిలో చదువుకుంటుందో కూడా ఆలోచించకుండా, దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను నేటి రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడటం ఎంతవరకు సమంజసం?” అని వెంకటకృష్ణ ప్రశ్నించారు.
సీతక్క గారి చిన్ననాటి జీవితం, ఆమె ఉద్యమ ప్రస్థానం, పోరాట నేపథ్యం గురించి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
“మీ కుటుంబానికి సంబంధించిన 39 ఏళ్ల నాటి ఘటనను నేడు ఎందుకు తీసుకొస్తున్నావ్. ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ ఒకటేనా. మీ వ్యక్తిగత విషాదాన్ని నేటి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు. ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలి పోరాట చరిత్రను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు” అని అన్నారు.
దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
“రమేశ్ రెడ్డి గారూ… మీకు నిజంగా నమ్మకం ఉంటే దేవగిరి పట్టణం నడిబొడ్డున కూర్చుందాం. మీ పార్టీ నాయకుడు సతీశ్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై బహిరంగంగా చర్చిద్దాం. మేము మా వద్ద ఉన్న ఆధారాలతో వస్తాం. మీరు కూడా మీ సమాధానాలతో రండి” అని పాలడుగు వెంకటకృష్ణ సవాల్ విసిరారు.
“ఆరోపణలు చేయడం కాదు… ఆధారాలతో మాట్లాడాలి. పాత ఘటనలను తెరపైకి తేవడం కాదు… ప్రస్తుతం మీ పార్టీ నాయకుడిపై వస్తున్న నగదు చెల్లింపులకు సమాధానం చెప్పాలి” అని అన్నారు.
చిన్ననాటి నుంచే పాటలు, ప్రజా సమస్యలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తితో ముందుకు సాగిన నాయకురాలు మంత్రి సీతక్క అని వెంకటకృష్ణ అన్నారు.
“దొరల అహంకారం, సామాజిక అసమానతలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల మధ్య నుంచి ఎదిగిన నాయకురాలు సీతక్క. అలాంటి నాయకురాలి పోరాట చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ, ప్రజలు ప్రశ్నిస్తారు” అని అన్నారు.
“ఖబడ్దార్ రమేశ్ రెడ్డి గారూ! రాజకీయ విమర్శలకు మేము సిద్ధమే. కానీ వ్యక్తిగత విషయాలను రాజకీయ ఆయుధాలుగా మార్చి, ఒక మహిళా నాయకురాలి పోరాట చరిత్రపై బురదజల్లే ప్రయత్నాన్ని మాత్రం సహించేది లేదు. మీ పార్టీ నాయకుడిపై వస్తున్న ఆరోపణలకు ముందు సమాధానం చెప్పండి. ప్రజల ముందు నిజాలు పెట్టండి. అవసరమైతే బహిరంగ చర్చకు రండి. ప్రజలు ఎవరి మాటలో నిజం ఉందో, ఎవరు విషయాన్ని దారి మళ్లిస్తున్నారో తేల్చుతారు.”అని పాలడుగు వెంకటకృష్ణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భుక్య రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి, కాడబోయిన రవి, జిల్లా కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, గణపాక సుధాకర్, తండా కృష్ణ, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ లావుడ్యా జోగా, రేగుల లక్ష్మణ్, ఇర్ప విజయ, గోపిదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
